ఐరోపా లో బెల్జియం దేశం సంక్రాంతి సంబరాలకు వేదికగా మారింది. కంపెన్ హౌట్ నగరం లో స్థానికంగా నివసించే ప్రవాస భారతీయ తెలుగు వారు అంత కలిసి తమ సొంత ఊర్లో జరుపుకున్నట్లుగా సంక్రాంతి పండుగను పిల్లా పెద్దలు కలిసి మెలసి శుభాకాంక్షలు తెలియ చేస్తూ సరదా సమయాన్ని గడిపారు. రుచికరమైన పిండివంటలతో, సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్నా పెద్దా కలిసి చిందులు వేశారు. రాత్రి పూట విందు భోజనంతో వేడుకను ముగించారు. దీప బోరెంగే, అనిత కనుమూరి ఆధ్వర్యం లో ఈ ఏర్పాట్లు జరిగినందుకు పాల్గొన్న వారు కృతజ్ఞతలు తెలియజేసారు.



